Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంపెనీ చరిత్రలో తొలిసారిగా కార్మిక సంఘం..!
- అనుకూలంగా ఓటు వేసిన 55 శాతం మంది వర్కర్లు
వాషింగ్టన్ : యూఎస్ ఆధారిత ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో తొలిసారిగా ఒక కార్మిక యూనియన్ ఏర్పడింది. ఈ మేరకు అమెజాన్ సంస్థకు చెందిన ఉద్యోగులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అమెజాన్ లేబర్ యూనియన్ (ఏఎల్‌యూ)కు అనుకూలంగా స్టాటెన్ ఐలాండ్‌లోని వేర్‌హౌజ్ కార్మికులు 55 శాతం మంది ఓటు వేశారని నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డు (ఎన్ఎల్ఆర్బీ) వెల్లడించింది. అమెజాన్ వేర్హౌజ్లలోని ప్రమాదకర పని పరిస్థితులను వ్యతిరేకిస్తూ గతంలో అనేక మంది కార్మిక నాయకులు తీవ్రంగా ప్రచారం చేశారు. ఉద్యోగులు, కార్మికులను ఏకం చేసే ప్రయత్నాలను వారు చేశారు. కానీ,వారి ప్రయత్నాలు విఫల మయ్యాయి.ప్రస్తుత విజయాన్ని ఏఎల్‌యూ సామాజిక మాధ్యమ ం ద్వారా పంచుకున్నది. తమను తాము ''యూఎస్ చరిత్రలో తొలి అమెజాన్ యూనియన్''గా అభివర్ణించుకున్నది. ''పవర్ టు ది పిపుల్'' అంటూ యూనియన్ స్ట్రాంగ్, ఏఎల్‌యూ ఫర్ ది విన్ హ్యాష్ ట్యాగ్‌లతో ట్వీట్‌ను ముగించింది. కాగా, ఎన్నికల ఫలితాలతో తాము నిరాశ చెందామని అమెజాన్ తెలిపింది. కంపెనీతో నేరుగా సంబంధాలుండటమే తమ ఉద్యోగులకు మంచిదని తాము విశ్వసిస్తున్నట్టు వివరించింది.స్టాటెన్ ఐలాండ్ సైట్లో యూనియన్ ఏర్పాటుకు యూనియన్ ఆర్గనైజర్, అమెజాన్ మాజీ ఉద్యోగి క్రిస్టియన్ స్మాల్స్ నేతృత్వం వహించారు. విజయం అనంతరం పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ అనంతరం ఇతర అధికారులు ఎన్ఎల్ఆర్బీ కార్యాలయాలను విడిచి వెళ్లారు.