Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనాను హెచ్చరించిన అమెరికా
వాషింగ్టన్ : ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న యుద్ధానికి చైనా మద్దతు పలికితే.. ఆ దేశం కూడా ఆంక్షలను ఎదుర్కొవలసి ఉంటుందని అమెరికా హెచ్చరించింది. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యాకు వస్తుపరమైన సాయాన్ని చైనా అందిస్తే.. పరిణామాలెలా ఉంటాయో డ్రాగన్ దేశానికి అవగాహన కల్పించాలంటూ అమెరికా విదేశాంగ డిప్యూటీ సెక్రటరీ వెండి షెర్మన్ అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా అమెరికా మిత్రదేశాలు విధించిన ఆంక్షల శ్రేణి రుచి చైనాకు సోదాహ రణంగా చూపించాలని అన్నారు. ' చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్. రష్యాకు ఏదైనా వస్తు రూపేణా పుతిన్‌కు మద్దతునిస్తే.. ఆయన ఏమీ ఎదుర్కొనున్నారో ఓ మంచి ఉదాహరణ ద్వారా అందించాలని భావిస్తున్నాను' అని ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ విచారణకు షెర్మన్ తెలిపారు. ప్రజాస్వామ్య బద్ధంగా పాలిస్తున్న తైవాన్ ద్వీపాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు చైనా చేపడుతున్న చర్యలు ఆమోద యోగ్యం కాదని.. ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్న పశ్చిమ దేశాల నుండి బీజింగ్ సరైన గుణపాఠం నేర్చుకుంటుందని హెచ్చరించారు.