Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా ఎంబసీ చార్జి డీ ఎఫర్స్తో పాక్ కొత్త ప్రధాని షెబాజ్ భేటీ
ఇస్లామాబాద్ : పాకిస్తానీ కొత్త ప్రధాని షెబాజ్ షరీఫ్ మంగళవారం చైనా ఎంబసీ చార్జి డీ ఎఫైర్స్ పాంగ్ చున్క్యూతో భేటీ అయ్యారు. చైనాతో సంబంధాలు పెంపొందించుకునేందుకు పాకిస్తాన్ కొత్త ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. వ్యవసాయం, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, దారిద్య్ర నిర్మూలనా రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సి వుందని ఆకాంక్షించారు. పాక్ కొత్త ప్రధానిగా ఎన్నికైన షెబాజ్కు చైనా ప్రభుత్వం తరపున పాంగ్ అభినందనలు తెలియచేశారు.