Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కీవ్ : నల్ల సముద్రంలోని తమ దేశ యుద్ధ నౌక తీవ్రంగా దెబ్బతిన్నట్టు రష్యా అధికారులు గురువారం ప్రకటించారు. యుద్ధ నౌకలో మందుగుండు సామగ్రి పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని రష్యా రక్షణశాఖ ప్రకటించింది. పేలుడుకి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపింది. సిబ్బంది మాత్రం సురక్షితంగా బయటపడినట్టు వెల్లడించింది. అయితే రష్యా యుద్ధనౌకపై తామే క్షిపణితో దాడి చేశామని ఉక్రెయిన్ ప్రకటించగా రష్యా ఈ ప్రకటనను తోసిపుచ్చింది. మేరియుపోల్, ఒడెస్సా వంటి తీర ప్రాంత నగరాలను లక్ష్యంగా చేసుకుంటోన్న రష్యా సేనలు.. దాడుల కోసం యుద్ధ నౌకలను తరలిస్తున్నాయి. ఉక్రెయిన్ తీరప్రాంతానికి రష్యాకు చెందిన మాస్క్వా క్రూజ్ చేరుకోగానే దానిపై క్షిపణితో దాడికి పాల్పడినట్లు ఒడెస్సా గవర్నర్ ప్రకటించారు. అయితే అక్కడ ఏం జరిగిందనే దానిపై దర్యాప్తు చేపడుతున్నామని అధ్యక్ష సలహాదారు ఒలెక్సీ అరెస్టోవిచ్ తెలిపారు.