Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి ఎండెమిక్ (స్థానికంగా వ్యాప్తి చెందే) దశకు చేరుకునేందుకు చాలా దూరంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఇటువంటి సమయంలో మరిన్ని విజంభణలకు వైరస్ కారణమవుతుందని స్పష్టం చేసింది. ఒకవేళ వైరస్ ఎండెమిక్ దశకు చేరుకొని స్థానికంగా స్థిరపడడం కూడా సమస్యకు ముగింపు అని భావించడం కూడా తప్పేనని స్పష్టం చేసింది.
'కరోనా వైరస్ ఎండెమిక్ దశకు ఇప్పట్లో చేరుకుంటుందని భావించడం లేదు. ఇప్పటివరకు ఏ ఒక్క సీజన్‌కో లేదా ఒకరకమైన వ్యాప్తి నమూనాకు పరిమితం కాలేదు. చాలా అస్థిరత, భారీ అంటు వ్యాధులు కలిగించే సామర్థ్యం మహమ్మారికి ఉంది. ఇప్పటికీ ఇంకా ఇది ఎండెమిక్ వ్యాధి కాదు' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర విభాగం డైరెక్టర్ మైక్ రేయాన్ పేర్కొన్నారు. క్షయ, మలేరియా వంటివి ఎండెమిక్‌గా మారినప్పటికీ వాటి బారినపడి ప్రతి ఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని గుర్తు చేశారు.