Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖాట్మండు : ఆర్థిక సంక్షోభానికి సంబంధించి నేపాల్ కూడా శ్రీలంక బాటలోనే పయనిస్తున్నట్టు ఆందోళనలు నెలకొంటున్నాయి. ఏడు మాసాల్లో విదేశీ మారక నిల్వలు 16శాతం క్షీణించాయని సంబంధిత నివేదిక పేర్కొంటోంది. ఫిబ్రవరి మధ్య నాటికి నేపాల్ విదేశీ మారక నిల్వలలు రూ.73,202 కోట్లు (959 బిలియన్ల డాలర్లు)కు పడిపోయాయి. కరోనా కాలంలో నేపాల్ పర్యాటక రంగం బాగా దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో ఇంధన కొరతలు కూడా తీవ్రమవనున్నాయని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో దేశంలో పెట్రోల్ పంపుల వద్ద రద్దీ పెరిగింది. వంట గ్యాస్, కూరగాయలతో సహా నిత్యావసరాల ధరలన్నీ మండిపోతున్నాయి. వస్తువుల ధరలు 20శాతం మేర పెరిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.