Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలపొడి బ్లాక్‌లో రూ.నాలుగువేలు..!
- శ్రీలంకలో తారాస్థాయికి సంక్షోభం
కొలంబొ: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో నిత్యావసరాల ధరలు తారాస్థాయికి చేరాయి. పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వ అధీనంలోని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఒక్కరోజే లీటరు పెట్రోల్‌పై రూ. 84 పెంచింది. దీంతో ప్రస్తుతం శ్రీలంకలో లీటరు పెట్రోల్ ధర రూ.338కి చేరింది. సూపర్ డీజిల్ ధర ఒక్క రోజే 75 రూపాయలు పెరిగి.. రూ. 329కి చేరింది. ఇక ఆటోలకు ఉపయోగించే డీజిల్ ధర రూ.113 రూపాయలు పెరిగి రూ.289కి చేరింది. పెట్రోల్, డీజల్ ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు కూడా అమాంతం పెరిగాయి. బియ్యం ధర 30శాతం పెరగడంతో కిలో బియ్యం ధర ప్రస్తుతం రూ.440గా ఉంది. కిలో కందిపప్పు రూ.600ని క్రాస్ చేయగా.. అసలు సాధారణ మార్కెట్లో పాల పౌడర్ దొరకని పరిస్థితి నెలకొంది. బ్లాక్‌లో నాలుగు వేలు ధర పలుకుతున్నట్టు తెలుస్తోంది. పెట్రో ధరల పెంపుతో ప్రయాణ చార్జీలు కూడా భారంగా మారాయి.. సిటీ బస్సుల్లో టికెట్ల ధరలు యాబై శాతం పెంచేశారు. మినిమం బస్సు ఛార్జీ రూ.50 రూపాయలుగా చేశారు. 20-40 రూపాయలకు దొరికే బ్రెడ్ ప్యాకేట్ ఏకంగా రూ. 230 పలుకుతోంది. పెరిగిన పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ గల్లాఫేస్ రహదారిపై ప్రజలు ఆందోళన చేపడుతున్నారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి రాజపక్సే కుటుంబ సభ్యులే కారణమనీ, అధ్యక్షుడు గొటబయా రాజపక్సే గద్దె దిగాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలు మిన్నంటుతున్నా అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు గొటబయా రాజపక్సే నిరాకరిస్తున్నారు.