Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : చిప్స్ ప్యాకెట్ దొంగిలించాడన్న కారణంగా ఎనిమిది ఏండ్ల నల్ల జాతి బాలుడి పట్ల అమెరికా పోలీసులు అమానుషంగా వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు న్యూయార్క్ పోలీసులు తెలిపారు. ఆ వీడియోలో సిరాక్యూస్ పోలీసు డిపార్ట్మెంట్కు చెందిన ఓ పోలీసు అధికారి.. పిల్లాడి చేతులను వెనక్కు పట్టుకుని.. తీసుకెళుతుండగా.. ఏడుస్తున్న దృశ్యాలున్నాయి. అక్కడే ఉన్న మరో ఇద్దరు పోలీసు అధికారులు చూస్తూనే ఉండి పోయారు. అందులో వీడియో చిత్రిస్తున్న వ్యక్తి.. ఏం చేస్తున్నారు అని బాలుడ్ని పట్టుకున్న పోలీసు అధికారిని అడగ్గా.. ఏం చేస్తున్నానో అంచనా వేయండంటూ సమాధానమిచ్చారు. మరో అధికారి ఆ బాలుడు చిప్స్ బ్యాగ్ దొంగిలించాడని చెప్పారు. బాలుడ్ని క్రిమినల్ మాదిరిగా ట్రీట్ చేస్తున్నారన్న వీడియో తీసిన వ్యక్తి.. దొంగిలించిన ప్యాకెట్లకు డబ్బులిస్తానని ఆఫర్ చేశారు. అయితే ఆ తర్వాత ఆ పిల్లవాడిపై ఎటువంటి అభియోగాలు నమోదు చేయకుండా విడిచిపెట్టారని స్థానిక మీడియా తెలిపింది. కాగా, ఈ వీడియోను చూసిన న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచల్ హృదయాన్ని కదిలించేదిగా అభివర్ణించారు. ఈ వీడియో మిలియన్ వ్యూస్ సంపా దించింది. చాలా మంది ఇదో జాత్యంహకార దాడిగా మండిపడు తున్నారు. 2020లో జార్జ్ఫ్లాయిడ్ అనే నల్లజాతి వ్యక్తిని అమెరికా పోలీసులు అతి కిరాతకంగా దాడి చేయడంతో చనిపోయిన సంగతి విదితమే. ఆ సమయంలో దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.