Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీ 20 దేశాలను హెచ్చరించిన మాస్కో
మాస్కో : తమపై అమెరికా, ఇయు సహా పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల వల్ల అంతర్జాతీయంగా ప్రభావం వుండగలదని రష్యా హెచ్చరించింది. ఇంధన ధరలు పెరగడం, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరిగిపోవడం వంటి పరిణామాలు వర్ధమాన, పేద దేశాలను తీవ్రంగా దెబ్బతీయగలవని రష్యా ఆర్థిక మంత్రి హెచ్చరించారు. కొన్ని దేశాలు తీవ్రమైన సామాజిక పర్యవసానాలు ఎదుర్కొనాల్సి వస్తుందని అన్నారు. జి 20 దేశాల ఆర్థిక మంత్రులతో వీడియో సమావేశంలో రష్యా ఆర్థిక మంత్రి ఆనతన్ సిలునొవ్ మాట్లాడుతూ, ప్రస్తుతం రష్యాపై విధించే ఆంక్షలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ముప్పులను కలగచేస్తాయన్నారు. అభివద్ధి చెందిన దేశాల్లో ఇటీవలి సంవత్సరాల్లో చేపట్టిన బడ్జెట్, ద్రవ్య విధానాలు ఆయా దేశాలపై ద్రవ్యోల్బణ ఒత్తిడి కలగచేశాయని, తాజాగా రష్యాపై ఆంక్షలతో ఆ ఒత్తిడి మరింతగా పెరగడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థలకు కొత్త ముప్పులు తలెత్తేందుకు దారి తీస్తాయన్నారు. ఆంక్షల కారణంగా రష్యా ఉత్పత్తులన్నీ పలు చోట్ల నిలిపివేస్తున్నారని, దీనితో సరఫరా, డిమాండ్ మధ్య అసమతుల్యత పెరుగుతుందన్నారు.