Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరిన అసాంజె భార్య
లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజెను అమెరికాకు అప్పగించొద్దని ఆయన భార్య స్టెల్లా అసాంజె బ్రిటన్ ప్రభుత్వాన్ని శనివారం కోరింది. అమెరికాకు అసాంజెను అప్పగిస్తే దాని పర్యవసానాలు యూరప్ అంతటా వుంటాయని ఆమె చెప్పింది. అసాంజెను అమెరికాకు అప్పగించేందుకు బ్రిటన్లోని దిగువ కోర్టు గత వారం సూచన ప్రాయంగా ఆమోదం తెలిపింది. అయితే, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది బ్రిటన్ ప్రభుత్వమేనని తెలిపింది. దీనిపై అసాంజె ఇంతవరకు ఎలాంటి అప్పీలు చేసుకోలేదని ఆంతరంగిక భద్రత శాఖ మంత్రి ప్రీతి పటేల్ తెలిపారు. అసాంజె భార్య చేసిన అప్పీలుపై ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాల్సి ఉంది. అమెరికా ఒత్తిడికి తలొగ్గి అసాంజెను అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం తలూపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.