Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓ వర్గానికి వ్యతిరేకంగా హింస గురించి మోడీని ఎందుకు ప్రశ్నించలేదు : బ్రిటన్ విపక్ష లేబర్ పార్టీ
లండన్ : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కూ బుల్డోజర్ల సెగ తగిలింది. ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన జాన్సన్.. గుజరాత్లో జేసీబీ కర్మాగారాన్ని ప్రారంభించి న అనంతరం.. అక్కడున్న బుల్డోజర్పైకి ఎక్కి, అభివాదం చేసిన విషయం తెలిసిందే. ఇక్కడి వివిధ రాష్ట్రాల్లో మతపరమైన ఘర్షణల క్రమంలో.. పలు ఇండ్లు, దుకాణాలను బుల్డోజర్లతో ధ్వంసం చేయడం వివాదాస్పదంగా మారిన తరుణంలో జాన్సన్ ప్రవర్తన తీవ్ర చర్చలకు దారితీసింది. బ్రిటన్ ఎంపీలు సైతం స్థానిక చట్టసభలో జాన్సన్ వైఖరిని తప్పుపట్టారు.భారత పర్యటన క్రమంలో ఓ వర్గానికి వ్యతిరేకంగా చేపడుతు న్న హింసపై మోడీని ప్రశ్నించడంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ విఫలమయ్యారని బ్రిటన్ విపక్ష లేబర్ పార్టీకి చెందిన జారా సుల్తానా అన్నారు. మానవ హక్కుల విషయంలో జాన్సన్ ఎంత శ్రద్ధ వహిస్తున్నారో అర్థమవుతుందని దుయ్యబట్టారు. మరో ఎంపీ నాదియా విటోమ్ స్పందిస్తూ.. 'బోరిస్ జాన్సన్ ఇటీవల భారత పర్యటనలో జేసీబీలతో ఫోజులిచ్చారు. అయితే మోడీతో ఇండ్ల కూల్చివేతలపై ప్రశ్నలు లేవనెత్తారో లేదో చెప్పలేదు' అని అన్నారు. మోడీ ప్రభుత్వ చర్యలకు చట్టబద్ధత కల్పించేందుకు తన భారత పర్యటన దోహదపడిందని అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు.