Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛాన్సెలర్ షుల్జ్‌తో ద్వైపాక్షిక చర్చలు
బెర్లిన్ : మూడు యూరప్ దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం బెర్లిన్ చేరుకున్నారు. జర్మనీ ఛాన్సలర్ ఓల్ఫ్ షుల్జ్‌తో ఆయన విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్-జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఇరువురు నేతలు పాల్గొంటారు. ఈ పర్యటనతో ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత పరిఢవిల్లుతాయని భావిస్తున్నట్టు మోడీ ట్వీట్‌చేశారు. జర్మనీతో భారత్ నిర్వహించే విశిష్ట ద్వైపాక్షిక వేదిక ఈ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల కమిటీ అని ఆయన పేర్కొన్నారు. జర్మనీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఆరు మాసాల్లోగా ఇలా సమావేశమవడం వల్ల మధ్య, దీర్ఘకాలంలో మన ప్రాధాన్యతలేమిటనేది గుర్తించడానికి దోహదపడుతుందని బెర్లిన్‌కు బయలుదేరడానికి ముందు మోడీ వ్యాఖ్యానించారు. గతేడాదికి రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 70 ఏండ్లయిందనీ, 2000 సంవత్సరం నుంచి వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నామని మోడీ పేర్కొన్నారు. షుల్జుతో వ్యూహాత్మక, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడానికి ఎదురుచూస్తున్నామని వ్యాఖ్యానించారు. జర్మనీలోని భారతీయులతో కూడా మోడీ సమావేశమవనున్నారు.