Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాస్ ఏంజెల్స్ : కరోనా మొదలైనప్పటి నుంచి అమెరికాలో కోటిమందికి పైగా చిన్నారులు వైరస్ బారిన పడ్డారని తాజా నివేదికలు వెల్లడించాయి. అమెరికాలో ఇప్పటివరకు దాదాపు కోటి ముప్పై లక్షలు (13 మిలియన్లు) మంది పిల్లలు కోవిడ్ బారినపడ్డారని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఎఎపి)- చిల్డ్రన్స్ హాస్పిటల్ నివేదిక వెల్లడించింది. ఇక ఈ కేసుల్లో నాలుగు వారాల క్రితం 149,000 కరోనా కేసులు నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఆ దేశంలో 50 లక్షల కేసులు నమోదయ్యాయని సోమవారం నాటి నివేదిక తెలిపింది. దీంతో ఆ దేశంలో కోవిడ్ కేసుల్లో 19 శాతం చిన్నారుల కోవిడ్ కేసులే నమోదయ్యాయని నివేదిక తేటతెల్లం చేసింది. కాగా, అమెరికాలో ఏప్రిల్ చివరి వారంలో.. 53,000 చిన్నారుల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇది రెండు వారాల క్రితం కంటే 60 శాతం పెరిగింది. గత మూడువారాలుగా వరుసగా చిన్నారులు కోవిడ్ బారినపడుతున్నట్లు ఎఎపి గుర్తించింది. కొత్త వేరియంట్లతోనూ..అలాగే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారి వయసుకు సంబంధించిన వివరాలను సేకరించాల్సి ఉందని ఎఎపి తెలిపింది. ఇక పిల్లల ఆరోగ్యంపై కోవిడ్ మహమ్మారి ప్రభావాలను గుర్తించడం చాలా ముఖ్యమని, చిన్నారులతోపాటు, యువత శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సుపై దీర్ఘకాలిక ప్రభావాలను గుర్తించి పరిష్కరించాలని ఎఎపి పేర్కొంది.