Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అబార్షన్ మహిళలు ఎంచుకునే ప్రాధమిక హక్కని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు. అబార్షన్ హక్కును కొట్టివేయాలన్న సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని తీవ్రమైనవిగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. అబార్షన్ హక్కును కొట్టివేసేందుకు సుప్రీంకోర్టు సుముఖంగా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. దీనికి సంబంధించి మెజార్టీ అభిప్రాయాల ముసాయిదా లీక్ అయినట్లు తెలిపింది. ఇది మహిళల హక్కులు కాలరాసే విధంగా ఉందని చెప్పొచ్చు. జస్టిస్ శామ్యూల్ అలిటో రాసినట్లుగా చెబుతున్న ఈ ముసాయిదా లీక్ అయినట్లు వార్తా సంస్థ పొలిటికో తెలిపింది. ఈ ముసాయిదాతో అమెరికన్ చట్టంలో విస్తతమైన మార్పులకు దారితీస్తాయని బైడెన్ హెచ్చరించారు. గోప్యతకు సంబంధించిన ప్రతి అంశం ప్రశ్నార్థకం చేయబడిందని అన్నారు. తీర్పు ఖరారైతే .. అబార్షన్ చట్టాలు రాష్ట్రాలపై ఆధారపడి ఉంటాయని, దీంతో ఈ హక్కుని సమర్థించే ప్రతినిధులను ఎంచుకునే ఓటర్లపై ప్రభావం పడుతుందని అన్నారు. అబార్షన్‌కు చట్టబద్ధత కల్పించాలని కాంగ్రెస్‌కు పిలుపునిచ్చారు. ఇది సుప్రీం తీర్పుని అధిగమించడానికి మార్గం సుగమం అవుతుందని అన్నారు. 50 ఏళ్ల అనంతరం కూడా మహిళలు ఎంచుకునే హక్కు లేకపోవడం తనను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని బైడెన్ పేర్కొన్నారు.