Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో : అమెరికన్ డాలర్ కన్నా రష్యా రూబుల్స్ మరింత బలోపేతమైంది. డాలర్, యూరో కన్నా రూబుల్ విలువ రెండేళ్ల గరిష్టాన్ని తాకింది. రెండు విదేశీ బాండ్లపై డాలర్ చెల్లింపులు గడువుకు ముందే రుణదాతలకు చేరాయన్న నివేదికలు వెల్లడించిన నేపథ్యంలో తాజా రిపోర్టు వెలువడింది. స్థానిక కాలమానం ప్రకారం 13.06 గంటలకు జరిగిన విదేశీ మారకపు ట్రేడింగ్‌లో మారకం రేటు డాలర్‌కు 66.43 రూబుల్స్కి చేరిందని బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది. అయితే మంగళవారం ప్రభుత్వ సెలవుదినం కావడంతో రష్యన్ ఎక్సేంజ్‌ను మూసివేయడంతో రష్యన్ కరెన్సీ రోజులో కొంత మేర లాభాలను కోల్పోవలసి వచ్చింది. బుధవారం ట్రేడింగ్ మార్కెట్ ప్రారంభం కాగానే 09.12 సమయానికి డాలర్‌కి 69 రూబుల్స్కి చేరిందని .. 2020మేలో కన్నా ఇది అత్యధికమని తెలిపింది.
అలాగే యూరోకి 72 రూబుల్స్కి చేరిందని..2020 ఫిబ్రవరి కన్నా అత్యధికమని వెల్లడించింది. ఉక్రెయిన్‌పై సైనిక చర్యలు చేపడుతున్న రష్యాపై అమెరికా సహా పలు దేశాలు వాణిజ్య ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. రష్యా ఇంధన దిగుమతులను క్రమంగా తగ్గించే విధంగా ఐరోపా దేశాలు రష్యాపై ఆరో ప్యాకేజీ ఆంక్షలను విధించింది. ఆర్థికవ్యవస్థలో రుణాలను పెంచేందుకు శుక్రవారం రష్యా సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను 14 శాతానికి తగ్గించింది. ప్రస్తుతం యూరో డాలర్‌తో పోలిస్తే ఐదేళ్ల కనిష్టానికి పడిపోయింది.