Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : స్థానిక ఎన్నికల్లో బ్రిటన్ పాలక పార్టీ ఘోర పరాజయం పాలైంది. రాజధాని లండన్ నగరంలో సాంప్రదాయసిద్ధంగా గట్టి పట్టు వున్న స్థానాల్లో పాలక కన్జర్వేటివ్ పార్టీ పూర్తిగా ఓటమి పాలైనట్టు శుక్రవారం వెలువడిన ప్రాథమిక ఫలితాలను బట్టి తెలుస్తోంది. వరుస కుంభకోణాలతో కునారిల్లుతున్న బోరిస్ జాన్సన్ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. తక్కువ పన్నులు వుండే, 1978 నుండి కన్జర్వేటివ్కు గట్టి పట్టు వున్న వండ్స్వర్త్లో జాన్సన్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. పెరుగుతున్న జీవన వ్యయం పట్ల, ప్రధాని కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు విధించిన జరిమానాలపై ఆగ్రహం వ్యక్తం చేసేందుకు ప్రజలు ఈ ఎన్నికలను ఉపయోగించుకున్నారు. 1964 నుండి జరిగిన ఎన్నికల్లో కేవలం రెండు ఎన్నికలు తప్ప ప్రతీసారీ కన్జర్వేటివ్ పార్టీ గెలుచుకునే లండన్ శివారు ప్రాంతమైన బరౌ ఆఫ్ బార్నెట్పై కూడా పాలక పార్టీ పట్టు కోల్పోయింది. ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కువగా వుండే వెస్ట్ మినిస్టర్ జిల్లాలో మొదటిసారిగా లేబర్ పార్టీ గెలిచింది.