Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : ప్రపంచంలోని అన్ని దేశాలకంటే అగ్రగామిగా ఉన్న అమెరికానే.. తలదన్నేవిధంగా చైనా ఎదుగుతోంది. శాస్త్ర, సాంకేతికతలతోపాటు, ఆర్థికంగానూ ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలుస్తోంది. చైనా ఈ స్థాయిలో ఎదగడానికి యువత ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. చైనాలో ప్రతి ఏటా మే 4న యువజన దినోత్సవం జరుగుతుంది. 1919 వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. 14 ఏండ్ల వయసు నుంచి.. 28 ఏండ్ల వయసులో వున్న వారు ఈ ఉత్సవంలో ప్రధానంగా పాల్గొంటారు. ప్రతి ఏడాది ప్రత్యేకంగా జరుపుకునే ఈ దినోత్సవాన్ని మే ఫోర్త్ ఉద్యమం అని కూడా పిలుస్తారు. ఇది చైనీస్ ప్రజలు జర్మనీ, జపాన్ దేశాల సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిపిన ఉద్యమం. ముఖ్యంగా ఆనాటి విద్యార్థులందరూ ఆ దేశాలకు వ్యతిరేకంగా సాంస్కృతికంగా, రాజకీయంగా అందరూ ఒకేతాటిపైకి వచ్చి బీజింగ్‌లో నిరసన చేపట్టారు. ఈ ఉద్యమాన్నే మే ఫోర్త్ ఉద్యమం అని అంటారు. ఈ నేపథ్యంలో ఏర్పడిన కమ్యూనిస్ట్ యూత్ లీగ్ ఆఫ్ చైనా (సీవైఎల్సీ) వందేండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా చైనాలో కొన్ని ప్రధాన నగరాల్లో స్మారక కార్యక్రమాలు, వేడుకలు జరిగాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్ని లక్షలాది మంది నెటిజన్లు వీక్షించారు.
చరిత్రలోకి వెళితే...
ఉత్తర చైనాను ఆక్రమించాలనే జపాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని చైనా కమ్యూనిస్టులు పిలుపునిచ్చారు. ఆ ఉద్యమం తదనంతరం డిసెంబర్- 9, 1935లో ఈ లీగ్ ఏర్పడింది. అప్పట్లో ఈ లీగ్‌ని సీపీసీ (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా) నిర్వహించింది. ఆ తర్వాత 1957లో దీని పేరు సీవైఎల్సీ (కమ్యూనిస్టు యూత్ లీగ్ ఆఫ్ చైనా)గా మారింది. చైనాలో మూడవ ప్లీనరీ తర్వాత.. 1979లో చైనా కమ్యూనిస్టు పార్టీ యువతలో ప్రత్యేకించి సోషలిజం భావాలను పెంపొందించేలా చర్యలు తీసుకుంటోంది. అందుకే అక్కడి యువత కమ్యూనిస్టు పార్టీవైపు మొగ్గుచూపుతున్నారు.