Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : భారత్‌లో కరోనా మరణ మృదంగంపై తీసిన చిత్రాలకు గాను భారత ఫొటోగ్రాఫర్ దానిష్ సిద్ధిఖీకి ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారం మరోసారి దక్కింది. ఆఫ్ఘనిస్తాన్, తాలిబన్ దాడుల్లో రాయిటర్ ఫొటోగ్రాఫర్ దానిష్ సిద్ధిఖీ గత ఏడాది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరణానంతరం ఆయనకు ఈ పురస్కారం దక్కింది. దానిష్ పులిట్జర్ పురస్కారానికి ఎంపిక కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 2018లో మయన్మార్‌లోని రోహింగ్యా శరణార్థుల ఫొటోకు తొలి పులిట్జర్ అందుకున్నారు. జర్నలిజమ్, పుస్తకాలు, నాటకం, సంగీతరంగాల్లో 2022 సంవత్సరానికి గానూ పులిట్జర్ ప్రైజ్ విజేతలను సోమవారం ప్రకటించారు. ఇందులో ఫీచర్ ఫొటోగ్రఫీలో దానిష్్ సిద్దిఖీ, అద్నన్ అబిదీ, సన్నా ఇర్షాద్, అమిత్ దవేలను విజేతలుగా ప్రకటించారు. భారత్‌లో కొవిడ్ మరణాలపై వీరు తీసిన చిత్రాలకు గానూ ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు కమిటీ వెల్లడించింది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌లో ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఢిల్లీలో ఒకేసారి అనేకమంది మరణించడంతో పలు శ్మశాన వాటికల్లో సామూహిక అంత్యక్రియలు చేపట్టారు. అందుకు సంబంధించి సిద్దీఖీ తీసిన ఫొటోలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఆ ఫొటోలు ఎంతోమంది హదయాలను కదలించాయి. ఎకానమిక్స్, మాస్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చేసిన సిద్దిఖీ తొలుత పలు టీవీ చానల్స్‌లో కరస్పాండెంట్‌గా పనిచేశారు. 2010లో రాయిటర్స్ సంస్థలో ఫొటో జర్నలిస్టుగా చేరారు. ఆ సంస్థ తరఫున దేశ, విదేశాల్లో అనేక సంచలన వార్తలను కవర్ చేశారు. హాంకాంగ్ అల్లర్లు, రోహింగ్యా ఆందోళనలకు సంబంధించిన ఫొటోలు తీశారు. గతేడాది ఆఫ్ఘన్లో ప్రభుత్వ దళాలు, తాలిబన్ల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని చిత్రీకరించేందుకు వెళ్లిన ఆయన విధి నిర్వహణలోనే తాలిబన్ కాల్పుల్లో మరణించారు. ఓ వార్తాపత్రిక పబ్లిషర్ జోసెఫ్ పులిట్జర్ పేరు మీదుగా కొలంబియా యూనివర్శిటీ 1917 నుంచి ప్రతి ఏడాది ఈ పురస్కారాలను అందిస్తోంది.