Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో : దేశంలో ఎల్టీటీఈ కదలికలు మళ్లీ ప్రారంభమవుతు న్నాయనీ, దాడులు చేయడానికి కుట్రలు పన్నుతున్నాయని వస్తున్న నివేదికలపై విచారణ చేయడానికి శ్రీలంక ప్రభుత్వం ఆదివారం నిర్ణయం తీసుకుంది.ఎల్టీటీఈ వార్తలను తిరస్కరించిన 24 గంటల వ్యవధిలో శ్రీలంక ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకోవడం విశేషం. రాజకీయ అనిశ్చితిలో చిక్కుకున్న శ్రీలంకలో దాడులకు ఎల్టీటీఈ కుట్ర పన్నుతోందని, 'ముల్లివైక్కల్ వార్షికోత్సవం'తో దాడులు జరుగుతున్నాయని భారత్‌కు చెందిన నిఘా వర్గాలు నివేదిక ఇచ్చినట్లు ఈ నెల13న వార్తలు వచ్చాయి. మే 2009 లో శ్రీలంక అంతర్యుద్ధం నేపథ్యంలో మరణించిన పదివేల మంది తమిళ పౌరుల జ్ఞాపకార్థం ప్రతీ ఏటా మే18న ముల్లివైక్కల్ వార్షికోత్సవం నిర్వహిస్తు ంటారు. అయితే వార్తలను నిరాధరమైవనవిగా శ్రీలంక రక్షణ శాఖ శనివా రం ఖండించింది. ఒక రోజు వ్యవధిలో వీటిపై విచారణ చేస్తామని తెలిపింది.
శ్రీలంకలో కర్ఫ్యూ సడలింపు
బుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీలంకలో ఆదివారం నుంచి బుధవారం వరకూ కర్ఫ్యూను సడిలించారు. ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో అధ్యక్షులు గొటబాయి రాజపక్స తన పదవికి రాజీమానా చేయాలనే డిమాండ్‌తో కొన్ని వారాల నుంచి శ్రీలంకలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనల్లో తొమ్మిది మరణించగా, 225 మంది గాయపడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అయితే దేశ ప్రజల్లో 70 శాతం మంది బౌద్ధమతాన్ని అనుసరిస్తుండటంతో అధికారులు కర్ఫ్యూ సడిలించారు.