Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హెల్సిన్కి : 'నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్' (నాటో) సైనిక కూటమిలో చేరాలనే ఉద్దేశ్యాన్ని ఫిన్లాండ్ అదివారం అధికారికంగా ప్రకటించింది. 'నాటో సభ్యత్వం కోసం ఫిన్లాండ్ దరఖాస్తు చేయనుందని' ఆదివారం క్యాబినేట్ సమావేశంలో అధ్యక్షులు సౌలి నీనిస్టో, ఇతర మంత్రులు ప్రకటించారు. 'మా నిర్ణయం చరిత్రాత్మకం. ఫిన్లాండ్, దేశ పౌరుల భద్రతకు అత్యంత ముఖ్యమైనది. ఈ నిర్ణయం నార్డిక్ దేశాల మధ్య భద్రత, సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది' అని ప్రధానమంత్రి సన్నా మారిన్ పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని ఫిన్లాండ్ పార్లమెంట్ ఆమోదిస్తుందనే విశ్వాసాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. నాటోకు ఇప్పటి వరకూ ఫిన్లాండ్, స్వీడన్ దూరంగా ఉన్నాయి. ప్రస్తుతం నాటోలో చేరడానికి ఈ రెండు దేశాలు ఇటీవల ఆసక్తిని కనబరుస్తున్నాయి. అయితే నాటోలో చేరాలంటే ఆ కూటమిలోని 30 సభ్య దేశాలూ ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలి. ఫిన్లాండ్, స్వీడన్లు నాటోలో చేరికకు టర్కీ సముఖంగా లేదు. ఈ రెండు దేశాలు 'ఉగ్రవాద సంస్థలకు అతిధి గృహాలు'గా టర్కీ అధ్యక్షులు ఎర్డోగాన్ ఇప్పటికే విమర్శించారు.