Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బలగాల తరలింపు పూర్తి చేసిన ఉక్రెయిన్
కీవ్,నొవొజొవాస్క్ : నెలల తరబడి బాంబు దాడులనంతరం ఓడరేవు నగరం మరియుపోల్‌పై పట్టును రష్యాకు వదిలివేస్తూ ఉక్రెయిన్ బలగాలు అక్కడ నుంచి వైదొలగాయి. మిగిలివున్న సైనికులందరినీ అక్కడ నుంచి ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకున్నామని ఉక్రెయిన్ మిలటరీ ప్రకటిం చింది. రష్యా అధీనంలోని పట్టణాల్లో వందలాదిమ ంది సైనికులు ఇంకా వున్నారు. వీరిలో చాలా మంది గాయపడ్డారు. వారిని కూడా ప్రస్తుతం తరలించారు. దీంతో సుదీర్ఘంగా, రక్తపాతంతో సాగిన ఉక్రెయిన్ యుద్ధం ఇక ముగిసినట్టు భావించే అవకాశాలున్నా యి. రష్యా దిగ్బంధం తర్వాత మరియుపోల్ పూర్తిగా శిధిలాల దిబ్బగా మారింది. ఈ నగరంలో వేలాదిమంది ప్రజలు మరణించారని ఉక్రెయిన్ పేర్కొంటున్నది. మరియుపోల్ నగరం పూర్తిగా తమ అధీనంలోకి వచ్చిందని ఇంతకుముందే రష్యా ప్రకటించినప్పటికీ ఇంకా నగరంలో భూగర్భంలో వున్న అజోవ్‌స్తల్ స్టీల్ ఫ్యాక్టరీలో ఉక్రెయిన్ బలగాలు, ప్రజలు వందల సంఖ్యలో వున్నారు. ఇటీవల ప్రజలను తరలించిన ఆర్మీ తాజాగా సైనికులను కూడా తరలించే చర్యలు చేపట్టింది. దీంతో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్లాంట్ పూర్తిగా రష్యా బలగాల అధీనంలోకి వచ్చింది. గాయపడిన సైనికుల ప్రాణాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సుప్రీం మిలటరీ కమాండ్ ఆయా శాఖల కమాండర్లను ఆదేశించినట్టు ఉక్రెయిన్ సాయుధ బలగాల జనరల్ ఒక ప్రకటనలో తెలిపారు. గాయపడిన సైనికులను ఆస్పత్రుల్లో చేర్చినట్టు ఉక్రెయిన్ డిప్యూటీ రక్షణ మంత్రి అన్నా మలైర్ తెలిపారు. ఉక్రెయిన్ వీరోచిత యోధులను కాపాడుకోవాలన్నది తమ లక్ష్యమనీ, అందుకోసం అన్ని చర్యలు తీసుకుంటామని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఐదు బస్సుల్లో సైనికులు అజోవ్‌స్తల్ నుండి వస్తున్న దృశ్యాలను మీడియా చిత్రీకరించింది. పోలాండ్ సరిహద్దుకు సమీపంలో పశ్చిమ నగరమైన లివివ్‌లో, కీవ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకాక రష్యా దాడులు కొనసాగుతున్నాయి.
మంగళవారం తెల్లవారు జామున కూడా లివివ్‌లో వరుస పేలుళ్లు సంభవిం చాయి. అయితే ఎవరూ మరణించినట్టు వార్తలందలే దు.మరోపక్క ఉక్రెయిన్‌పై యుద్ధానికి గానూ రష్యా తీవ్ర ఆంక్షలను ఎదుర్కొంటోంది. రష్యాను వీడిన అతిపెద్ద అంతర్జాతీయ బ్రాండ్లలో మెక్‌డొనాల్డ్ ఒకటి. గత 30 ఏండ్ల నుంచి ఆ దేశంలో నడుపుతున్న రెస్టారెంట్లన్నింటినీ మూసేసి, విక్రయించాలని చూస్తోంది.