Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో : అంతర్జాతీయ పరిస్థితుల్ని మరింత క్లిష్టతరం చేయడానికే అమెరికా నాటో విస్తరణను దూకుడుగా చేపడుతోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నాటోలో చేరేందుకు ముందుకువచ్చిన దేశాల్లో సైనిక సదుపాయాలను మెరుగుపరిస్తే.. తమ దేశ స్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. తమ దేశానికి వచ్చే బెదిరింపులకు తగినట్లే.. తమ స్పందన ఉంటుందనీ, అకారణంగా సమస్యలు సృష్టిస్తే.. వాటికి అనుగుణంగానే తాము మందుకు వెళ్తామని పుతిన్ పేర్కొన్నారని స్థానిక మీడియా తెలిపింది. అమెరికా నాటో విస్తరణతో ఇప్పటికే క్లిష్టంగా ఉన్న అంతర్జాతీయ పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రష్యాతో 1,300 కిలోమీటర్లకుపైగా సరిహద్దు కలిగి ఉన్న ఫిన్లాండ్ నాటోలో చేరనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. తమ దేశం నాటో కూటమిలో చేరేందుకు సిద్ధమని స్వీడన్ ప్రధాని మాగ్దలీనా అండర్సన్ కూడా ప్రకటించారు. ఈ చర్యలు తీవ్ర తప్పిదాలని రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.