Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : కరోనా వైరస్ కారణంగానే చిన్నారుల్లో కాలేయ వ్యాధి సోకుతోంది. కరోనా వైరస్ నుండి కోలుకుంటోన్న పలు దేశాల్లోని చిన్నారులు కాలేయ వ్యాధి బారిన పడుతున్నట్లు నిపుణులు గుర్తించారు. యూరప్, అమెరికా దేశాల్లోని చిన్నారుల్లో కనిపించిన ఈ వ్యాధిపై విస్తత పరిశోధనలు కొనసాగుతున్నాయి. గుర్తించని కరోనా వైరస్ కారణంగా వచ్చే దుష్ప్రభావాలు చిన్నారుల్లో తీవ్రమైన కాలేయ వ్యాధికి కారణం కావచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. కరోనా వైరస్ బారినపడిన చిన్నారులు కాలేయ వ్యాధుల బారినపడే ముప్పు ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. ఎక్కువ మంది బాధిత చిన్నారుల్లో అడినోవైరస్ను గుర్తించారు. అయితే తీవ్ర కాలేయ వ్యాధి బారినపడిన చిన్నారులకు గతంలో కరోనా వైరస్ సోకిన దాఖలాలు లేవు. అయినప్పటికీ ఆ చిన్నారుల్లో మెజారిటీ పిల్లలకు మాత్రం కాలేయంపై దాడి చేసే 41ఎఫ్ అనే అడినోవైరస్ సోకినట్లు నిపుణులు గుర్తించారు. అంటే చిన్నారుల్లో కరోనా వెలుగు చూడనప్పటికీ లక్షణాలను గుర్తించలేకపోయి ఉండవచ్చని ది లాన్సెట్ గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే జీర్ణాశయ మార్గంలో అడినోవైరస్-42ఎఫ్ ప్రభావం కాలేయాన్ని దెబ్బతీయవచ్చన్నారు. ఈ నేపథ్యంలో కాలేయ వ్యాధితో బాధపడుతోన్న చిన్నారుల మలం ద్వారా వారిలో ఏ మేరకు కరోనా వైరస్ ఉందో తెలుసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. అయితే, ఇందుకు సంబంధించిన అధ్యయనం అంతర్జాతీయ జర్నల్లో విశ్లేషణకు రావాల్సి ఉంది.