Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హవానా : కోవిడ్-19 వ్యాక్సినేషన్‌ను నూటికి నూరు శాతం పూర్తి చేసిన దేశంగా క్యూబా ప్రపంచానికే అగ్రగామిగా నిలిచింది. చాలా సంపన్న దేశాలు ఈ విషయంలో వెనకబడి ఉన్నాయి. నివాసితులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందించడంలో ప్రపంచ నెంబర్‌వన్‌గా క్యూబా నిలవడం తామెంతో గర్వకారణంగా భావిస్తున్నామని క్యూబన్ విదేశాంగ మత్రి బ్రూనో రొడ్రిగజ్ శనివారం ట్వీట్ చేశారు. క్యూబా మొత్తం జనాభాలో కోవిడ్ వ్యాక్సినేషన్‌కు అర్హులైనవారు 96.7 శాతం మంది ఉన్నారు. వీరందరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్‌ను పూర్తయింది. 80.9 శాతం మందికి బూస్టర్ డోసు కూడా అందించామని మంత్రి తెలిపారు. పసి పిల్లలు కోవిడ్ బారిన పడకుండా చూసేందుకు బాలల ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన తొలి దేశం క్యూబానే. క్యూబా దేశీయంగా రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్లు నేడు డజనుకుపైగా దేశాలు ఉపయోగిస్తున్నాయి.