Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్ : మహిళా యాంకర్లు ముఖాలు కప్పుకుని కెమెరా ముందుకు రావాలని ఆఫ్గనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పురుష యాంకర్లు మాస్కులు ధరించి నిరసన తెలిపారు. తాలిబన్ల నిర్ణయంపై హక్కుల కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని పలు మీడియా సంస్థ లు తాలిబన్ ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేశాయి. ప్రభుత్వ ఆదేశాల్ని తాలిబన్ వైస్ అండ్ వర్చ్యూ మినిస్ట్రీ అమలు చేయడం ప్రారంభించాక ఎక్కువ మంది యాంకర్లు ముసుగులోనే కనిపిస్తున్నారు. ఈ విషయంపై ఆఫ్ఘన్ ఇన్ఫర్మేషన్ అండ్ కల్చర్ మినిస్ట్రీ గతంలో స్పందిస్తూ.. ఇదే చివరి మాటని, దీనిపై ఎలాంటి చర్చ ఉండబోదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మాస్క్ ధరించాలని బలవంతపెట్టడం ఆఫ్ఘన్ సంస్కతి కాదని, ఇది బయటి సంస్కతని, మాస్క్ ధరించి కార్యక్రమాలు నిర్వహించడం చాలా కష్టంగా ఉందని ఆఫ్ఘన్‌లోని టోలో టీవీ న్యూస్ యాంకర్ తెలిపారు. టోలో టీవీలోని పురుష జర్నలిస్టులు అందరూ మహిళా యాంకర్లకు మద్దతుగా మాస్క్‌లు ధరించి విధుల్లో పాల్గొన్నారు. ఈ చానల్లో అత్యంత ప్రజాదరణ ఉన్న సాయంత్రం 'న్యూస్‌రీడర్' కార్యక్రమంలో పాల్గొన్న యాంకర్ సైతం మాస్క్ ధరించారు.