Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : ప్రమాదంతో పోరాడుతున్నారన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యలపై చైనా మండిపడింది. తైవాన్ విషయంలో తమ జాతీయ ప్రయోజనాలను రక్షించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా సోమవారం తెలిపింది. చైనా స్వయం పాలిత తైవాన్ను నియంత్రించేందుకు యత్నించలేదని, తైవాన్ను తమ భూభాగంలో భాగంగా భావిస్తోందని పేర్కొంది. జాతీయ ప్రయోజనాలు, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో చైనాను ఎవరూ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదనిౖ చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ అన్నారు. తైవాన్ చైనా భూభాగంలో విడదీయరాని భాగంగా కలిసి ఉందని అన్నారు. చైనా జాతీయ భద్రతను 140 కోట్ల ప్రజల ధృడచిత్తంతో కాపాడుకుంటుందని అన్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ టోక్యోలో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రమాదంతో చైనా పోరాడుతోందని అన్నారు. తైవాన్‌పై దాడికి పాల్పడితే సైనిక పరంగా సాయం అందిస్తామని గతంలో వాగ్దానం చేశామని బైడెన్ పేర్కొన్న సంగతి తెలిసిందే.