Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇజ్రాయిల్‌తో సంబంధాలను
- నేరంగా పరిగణించే చట్టానికి ఇరాక్ ఆమోదం
బాగ్దాద్ : ఇజ్రాయిల్‌తో సంబంధాలను నేరంగా పరిగణించే చట్టానికి ఇరాక్ పార్లమెంట్ తాజాగా ఆమోదం తెలిపింది. షియా మతాధికారి ముక్తాదా అల్ సదర్ ప్రతిపాదన మేరకు ఈ చట్టాన్ని రూపొందించారు. అల్జీరియా పార్లమెంట్ కూడా ఇటు వంటి చట్టాన్ని గత వారంలో ఆమోదించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ చట్టం ఆమోదం సందర్భంగా ఇరాక్ షియా ఎంపి హసన్ సలీం మాట్లాడుతూ 'ఈ చట్టం ఆమోదించబడ్డం కేవలం ఇరాక్ ప్రజల విజయం మాత్రమే కాదు. పాలస్తీనా నాయకులు, లెబనాన్‌లోని హిజ్బుల్లా నాయకుల విజయం కూడా' అని అభివర్ణించారు. ఇజ్రాయిల్‌ను గుర్తించడానికి నిరాకరిస్తున్న ఇరాక్ యొక్క దీర్ఘకాల విధానాన్ని కూడా ఈ చట్టం పునరుద్ఘాటిస్తుంది.కాగా, సౌదీఅరేబియా వంటి పొరుగుదేశాలు ఇజ్రాయిల్‌ను గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఇరాక్ ఈ విధమైన చట్టం చేయడం విశేషం.