Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తారా విమాన ప్రమాద ఘటనపై నేపాల్ మీడియా
ఖాట్మండు : తారా ఏయిర్‌లైన్స్‌కు చెందిన విమాన ప్రమాదంలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయట పడలేదని నేపాల్ మీడియా తెలిపింది. 22 మందితో ప్రయాణిస్తున్న తారా ఏయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ముస్తాంగ్ జిల్లా పర్వతాల్లో దురదృష్టవశాత్తు కుప్పకూలిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో నలుగురు భారతీయులు, ఇద్దరు జర్మన్లు, 13 మంది నేపాలీ ప్రయాణికులున్నారు. అలాగే, ముగ్గురు నేపాలి సిబ్బంది కూడా ఉన్నది. వీరంతా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
కెనడా తయారీ విమానం పొఖారా నుంచి సెంట్రల్ నేపాల్‌లోని జామ్‌సమ్‌కు టేకాఫ్ తీసుకున్నది. 15 నిమిషాల తర్వాత ఈ విమానం గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. ఈ విమాన ప్రమాద ఘటనలో 14 మృతదేహాలను కనుగొన్నట్టు నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది. మృతదేహాలను గుర్తించలేదని పేర్కొంటూ ఒక ట్వీట్ చేసింది. విమాన శకలాలలను ముస్తాంగ్ జిల్లాలో కనుగొన్నట్టు నేపాల్ ఆర్మీ తెలిపింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన భారతీయులు అశోక్ కుమార్ త్రిపాఠి, ఆయన భార్య వైభవి బండేకర్ (త్రిపాఠి), వారి పిల్లలు ధనుశ్, రితిక లుగా గుర్తించిన విషయం తెలిసిందే. '' కుప్పకూలిన ప్రదేశం : సనోస్వేర్, థసంగ్-2, ముస్తాంగ్'' అని నేపాల్ ఆర్మీ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ నారాయణ్ సిల్వాల్ కుప్పకూలిన విమానానికి సంబంధించిన చిత్రాలను ట్విట్టర్లో షేర్ చేశారు.