Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాన్బెర్రా : ఆస్ట్రేలియా కొత్త ప్రభుత్వం బుధవారం ప్రమాణ స్వీకారం చేసింది. రికార్డు స్థాయిలో 13మంది మహిళా మంత్రులు కొత్త ప్రభుత్వంలో కొలువుదీరారు. వీరిలో మొదటి ముస్లిం మహిళా మంత్రి, రెండవ ఆదివాసీ మంత్రులు వున్నారు. రాజధాని కాన్బెర్రాలో గవర్నర్ జనరల్ డేవిడ్ హర్లే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తంగా కొత్త ప్రభుత్వంలో 30మంది మంత్రులు వుండగా, వీరిలో దాదాపు సగంమంది మహిళలే కావడం విశేషం. 23 కీలక కేబినెట్ పదవుల్లో పది పదవులు మహిళలకే దక్కాయి. సెంటర్ లెఫ్ట్ లేబర్ పార్టీ నేతృత్వంలో కొత్త ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఎన్నికల్లో విజయం సాధించిన 11 రోజులకు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. వైవిధ్యభరితమైన ప్రభుత్వానికి నాయకత్వం వహించడం ఆనందంగా వుందని, కొత్త మంత్రులందరికీ స్వాగతమంటూ అల్బనీస్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. యువజన వ్యవహారాల మంత్రి అనె అలై ఆస్ట్రేలియా మొదటి ముస్లిం మహిళా మంత్రి. పరిశ్రమలు, సైన్స్ శాఖ మంత్రి ఈద్ హుసిక్ మొదటి ముస్లిం మంత్రిగా వున్నారు.