Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బహ్రయిన్ టీఆర్ఎస్ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎన్నారై విభాగం ప్రధాన కార్యదర్శి పుప్పాల లింబాద్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అమరవీరులను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎన్నారై విభాగం అధ్యక్షులు రాధారపు సతీశ్‌కుమార్, ఉపాధ్యక్షులు వెంకటేశ్ బొలిశెట్టి మాట్లాడుతూ..ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం అసువులు బాసిన ఎందరో మహనీయుల త్యాగఫలం, సీఎం కేసీఆర్ సంక్షేమపథకాలు, మెరుగైన పాలనతో అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. పెద్దపెద్ద పరిశ్రమలు, వేల కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొస్తున్న ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు అభినందనలు తెలిపారు. నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యుల నడ్డివిరుస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు రానున్నకాలంలో సరైన గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో ఎన్నారై విభాగం కార్యదర్శులు సంగేపు దేవన్న, సీహెచ్.రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.