Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియా కొత్త ప్రధాని వెల్లడి
సిడ్నీ : అధిక ధరల నుంచి వేతన జీవులకు ఊరట కల్పించాలని ఆస్ట్రేలియా కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యేవాద, వామపక్ష అనుకూలవాదిగా పిలవబడుతున్న లేబర్ పార్టీ నేత, గత వారం ప్రమాణ స్వీకారం చేసిన కొత్త ప్రధాని ఆంథోని అల్బనీస్ శుక్రవారం నాడు ఈ మేరకు ఒక ప్రతిపాదనను స్వతంత్ర వేతన నిర్ణాయక సంస్థ కు పంపారు. ఇంధన ధరల పెంపు కారణంగా వినియోగదారుల ధరలు పెరిగిపోయి కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారాలను తగ్గిం చే లక్ష్యంతో కనీస వేతనాలు పెంచాలని తన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అల్బనీస్ చెప్పారు. గంటకు 20.33 ఆస్ట్రేలియన్ డాలర్లు సంపాదించే అతి తక్కువ వేతనం కలిగిన కార్మికునికి వేతనాలు పెంచేందుకు ఈ ప్రతిపాదన దోహదపడుతుంది. రాబోయే కొద్ది వారాల్లో ఫెయిర్ వర్క్ కమిషన్ కనీస వేతనాలపై నిర్ణయిస్తుంది.