Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పశ్చిమ దేశాలపై పుతిన్ ధ్వజం
మాస్కో : పశ్చిమ దేశాలు తాము చేసిన తప్పులకు రష్యాను నిందించడం ఫ్యాషనైపోయిందని రష్యా నేత పుతిన్ ధ్వజమెత్తారు. రష్యా-24 చానెల్‌కు ఇంటర్వ్యూకు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించినప్పటి నుండి అమెరికా సహా పలు యూరోపియన్ దేశాలు ప్రతీకార చర్యలు తీసుకున్నాయి. ఫలితంగా ఆహారం, ఎరువుల రంగాల్లో సంక్షోభం తీవ్రతరమైంది. ప్రపంచ ఎరువుల ఉత్పత్తి మార్కెట్లో రష్యా వాటా 25శాతంగా వుంది. ''మా భాగస్వాములు వారంతట వారు చాలా తప్పులు చేశారు. ఇప్పుడు వాటికిగానూ ఎవరినో ఒకరిని నిందించాల్సిన అవసరం వుంది. ఇందుకు సంబంధించి అత్యంత అనుకూలమైన దేశంగా రష్యా కనిపిస్తోంది.'' అని రష్యా అధ్యక్షుడు పేర్కొన్నారు. ఆహార, ఎరువుల రంగాల్లో సంక్షోభాలను ప్రస్తావిస్తూ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.