Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాథలిక్ చర్చ్‌పై దాడి
- 50 మందికి పైగా మృతి !
అబూజ : ఉగ్రవాదుల మారణహౌమంతో ప్రపంచం మరోసారి ఉలిక్కి పడింది. అదను చూసి కాల్పులు, బాంబు దాడులతో నరమేధం సష్టించారు. ప్రాణాల కోసం బయటకు పరిగెత్తినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు.. చెల్లాచెదురైన మృతదేహాలే ఎటు చూసినా కనిపించాయి. నైజీరియాలో ఓ కాథలిక్ చర్చిపై ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. చర్చిలో ప్రార్థనలు చేస్తున్న మతగురువులు, భక్తులపై కాల్పులకు పాల్పడటంతో పాటు బాంబులు విసిరారు. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయింటారని అధికారులు భావిస్తున్నారు. ఒండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాథలిక్ చర్చ్ లక్ష్యంగా ఆదివారం ప్రార్థనల సమయంలో ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని శాససభ్యుడొకరు తెలిపారు. ఈ మారణకాండలో చనిపోయింది అత్యధికంగా చిన్నారులేనని చెప్పారు. అదే సమయంలో ఈ చర్చి ప్రధాన మతగురువు అపహరణకు గురయ్యారని మరో శాసనసభ్యుడు టిమిలీన్ తెలిపారు. కాగా, ఈ ఘటనలో ఎంత మంది చనిపోయారో అధికారికంగా ప్రకటించనప్పటికీ.. 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని టిమిలీన్ తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో చర్చిలోని ప్రార్థన స్థలం మొత్తం రక్తంతో తడిసిముద్దయింది. ఈ ఘటనను నైజీరియా అధ్యక్షుడు మహ్మద్ బుహారీ ఖండించారు. ఇటువంటి దుశ్చర్యలకు దేశం లొంగిపోదంటూ వ్యాఖ్యానించారు. చీకటి ఎప్పటికీ కాంతిని అధిగమించదని, నైజీరియా చివరకు గెలుస్తుందని అన్నారు.