Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పడిపోయిన ఆహార ధాన్యాల సరఫరాలు
బ్లెయిజ్ డారిస్టోన్ (చాద్) : తగినన్ని ఆహార ధాన్యాల సరఫరాలు కొరవడడంతో గత వారం ఆఫ్రికన్ దేశం చాద్ ఆహార అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. దేశంలో పెరుగుతున్న ఆహార అభద్రత నేపథ్యంలో తమకు అంతర్జాతీయ సమాజం నుంచి సాయం కావాలని ఆర్ధించింది. ఉక్రెయిన్లో యుద్ధం, రష్యాపై అంతర్జాతీయ ఆంక్షల కారణాలతో ఉక్రెయిన్ నుంచి రావాల్సిన ఎగుమతులు తగ్గడం, పైగా ఎరువుల సరఫరాలకు ఆటంకం ఏర్పడడంతో ఆఫ్రికా వ్యాప్తంగా తృణధాన్యాల ధరలు పెరిగిపోయాయి. ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, దీనికి తోడు లభ్యత కూడా బాగా తగ్గిపోయిందని ప్రజలు పేర్కొంటున్నారు. వెయ్యి సీఎఫ్ఏ ఫ్రాంకులకు బియ్యం, 600 ఫ్రాంకులకు మసాలా దినుసులు, 1500 పెట్టి మాంసం కొన్నా, కేవలం నలుగురికి ఒక పూట భోజనం కోసం 3వేల ఫ్రాంకులకు పైగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని ఒక మహిళ వాపోయారు. గతంలో ఇవే కొనుగోళ్ళకు దాదాపు 2వేల వరకు ఖర్చయ్యేదని అన్నారు. నెలకు దాదాపు 90వేల ఫ్రాంకులు ఖర్చు పెట్టినా సరిపోవడం లేదని అన్నారు. దీనివల్ల తినే ఆహారాన్ని తగ్గించుకోవాల్సి వస్తోందని, పిల్లలు బాగా దెబ్బతింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ దేశ జనాభాకు అవసరమైన ఆహారం కావాలని వారు డిమాండ్ చేశారు. నగరాల్లోని మధ్య తరగతి ప్రజానీకమే ఈ పరిస్థితులను ఎదుర్కొనలేకపోతే ఇక గ్రామీణ ప్రాంతాల్లోని పేదల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయంగా గోధుమల ధరలు వరుసగా నాలుగవ నెల్లో కూడా పెరిగాయని ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) పేర్కొంది. ఈ ఆహార అత్యయక పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కూడా తగు రీతిలో స్పందించడం లేదని చాద్ వినియోగదారుల హక్కుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి దౌదా ఎల్ హజ్ది విమర్శించారు.