Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉక్రెయిన్‌లో పరిణామాలపై బైడెన్ వ్యాఖ్య
వాషింగ్టన్: రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ను రెచ్చగొట్టి, ఆయుధా లిచ్చిన అమెరికా ఇప్పుడు భిన్నమైన స్వరాన్ని వినిపిస్తున్నది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యాతో ఘర్షణ వల్ల చోటుచేసుకోబోయే పరిణా మాల గురించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి తాము ముందే చెప్పామ ని, అయితే, ఆయన వినడానికి ఇష్ట పడలేదని అమెరికా అధ్యక్షులు జో బైడెన్ వెల్లడించారు. లాస్ ఏంజెల్స్‌లో నిధుల సమీకరణ నిమిత్తం జరిగి న కార్యక్రమంలో భాగంగా నాలుగు నెలలనాటి పరిణామాలను వివరిం చారు. 'రష్యా దాడి గురించి నేను ముందస్తుగా చేసిన హెచ్చరికలను అతిశయోక్తిగా చేసిన ప్రకటన అని చాలామంది భావించారు. అది నాకు తెలుసు. కానీ మాకున్న సమాచారం ఆధారంగా మేం వెల్లడించాం. ఆయన (పుతిన్‌ను ఉద్దేశించి) సరిహద్దుల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే జెలెన్స్కీ ఈ విషయాన్ని వినేందుకు ఇష్టపడలేదు. ఇంకా చాలామంది వినలేదు. వారు ఎందుకు వినకూడ దనుకుంటున్నారో నాకు అర్థమైంది. కానీ ఆయన అప్పటికే వెళ్లిపోయారు' అంటూ బైడెన్ వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న రష్యా ప్రత్యేక సైనిక చర్యను ప్రకటించకముందే.. రష్యా సైనిక సన్నద్ధ తపై అమెరికా హెచ్చరికలు చేసింది. తేదీతో సహా యుద్ధం ప్రారంభమ య్యే రోజును పేర్కొంది. అమెరికా హెచ్చరికలను ఐరోపా మిత్రదేశాలు కొన్ని నమ్మలేదు. అమెరికా మరీ ఎక్కువ ముందు జాగ్రత్త పడుతోందని అంతా భావించారు.