Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగ్లాదేశ్ ఐటి మంత్రి
ఢాకా : మహమ్మద్ ప్రవక్త గౌరవం విషయంలో ఎలాంటి రాజీ పడమని బంగ్లాదేశ్ సమాచార శాఖ మంత్రి హసన్ మహ్మద్ తెలిపారు. భారత్‌లోని బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలపై మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది భారత్‌కు చెందిన అంతర్గత అంశమని, అయితే ఇలాంటివి ఎక్కడ జరిగినా ఖండిస్తామని చెప్పారు. వివాదాస్పద వ్యాఖ్య లు చేసిన బిజెపి నాయకులపై భారత ప్రభుత్వం చర్య తీసుకుంటుందనే నమ్మకాన్ని మంత్రి వ్యక్తం చేశారు. గత ఏడాదిలో బంగ్లాదేశ్‌లోని హిందు వులపై దాడులను తమ ప్రభుత్వం కఠినంగా అణిచివేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. నష్టపోయిన మైనార్టీలకు మూడు రెట్లు ఎక్కువగా పరిహారాన్ని అందిచేసినట్లుగానూ తెలిపారు. అలాగే భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య కనెక్టివిటీ మెరుగుపర్చే రహదారి, రైలు మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు.