Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో : శ్రీలంకలో కనీసం మూడేళ్ల వరకూ కరెంటు కోతలను ఎదుర్కొక తప్పదని ఆ దేశ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిలోన్ ఎలక్ట్రసిటీ బోర్డు (సీఈబీ) ఇంజనీర్ల యూనియన్ తాజాగా హెచ్చరించింది. సీఈబీ ఇంజనీర్ల యూనియన్ అధ్యక్షులు అనిల్ రంజిత్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో విద్యుత్ డిమాండ్‌కు తగినట్టుగా దేశంలోని విద్యుత్ ఉత్పత్తి సంస్థలు విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేకపోతున్నాయని తెలిపారు. 'థర్మల్, వాయు, ఎల్ఎన్జీ, బొగ్గు లేదా సౌర మార్గాలు ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచే వరకూ దేశంలో కరెంటు కోతలు కొనసాగుతూనే ఉంటాయి' అని చెప్పారు. ఇంధన కొరత కారణంగా ఈ ఏడాది పిభ్రవరి 22 నుంచి దేశంలో కరెంటు కోతలు అమలవుతున్నాయనీ, పరిస్థితిని నివారించడానికి రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్ ప్రాజెక్టును ప్రభుత్వం వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు శ్రీలంక విద్యుత్, ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేఖర్ మాట్లాడుతూ విద్యుత్ ప్లాంట్ల కోసం డీజిల్ దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేనందున పునరుత్పాదక ఉత్పత్తులకు దేశం మారాలని తెలిపారు.