Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్/కీవ్: ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో నిర్మాణా త్మక పాత్ర పోషించడానికి తాను సిద్ధమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిగిన ఫోన్ సంభాషణలో జిన్‌పింగ్ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు చైనా అధికారిక వార్తాసంస్థ జిన్హువా తెలిపింది. మిగిలిన దేశాలు కూడా బాధ్యతాయుత పాత్రను పోషించి, సంక్షోభానికి సరైన పరిష్కారం లభించేలా చూడాలని జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు. దానిలో చైనా తమ వంతు పాత్రను పూర్తి చేస్తుందని అన్నారు. 'వాస్తవాలు, చారిత్రక సత్యాలను పరిగణనలోకి తీసుకుని ఉక్రెయిన్ విషయంలో మేం స్వతంత్ర వైఖరిని అనుసరి స్తున్నాం. ప్రపం చ శాంతి పరిరక్షణకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ప్రపంచ ఆర్థిక పురోగతి నిలకడగా ఉండేందుకు పాటుపడుతున్నాం' అని వివరించారు.