Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికాలో భారత సంతతికి చెందిన మరో మహిళకు ఉన్నత స్థానం లభిం చనున్నది. పెంటగాన్ ఉన్నత స్థానా నికి ఇండో-అమెరికన్ రాధా అయ్యంగార్ ప్లంబ్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. తన పరిపాలనలో కీలక నేతల నిమిత్తం పలువుర్ని బైడెన్ నామినేట్ చేయగా.. అందులో రాధా ఒకరు. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్‌లో భాగంగా అక్విజిషన్ అండ్ సస్ట్ట్తెన్మెంట్ కోసం డిప్యూటీ అండర్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్‌కు ఆమె పేరును నామినేట్ చేశారు. ఎకనామిక్స్‌లో ఎంఎస్, పీహెచ్డీ పూర్తి చేసిన ఆమె.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వ్యవహరించారు. రాధా ప్రస్తుతం డిఫెన్స్ డిప్యూటీ సెక్రటరీ చీఫ్ స్టాఫ్‌గా వ్యవహరి స్తున్నారు. చీఫ్స్టాఫ్గా నియమకానికి ముందు.. ఆమె గూగుల్‌లో ట్రస్ట్ అండ్ సేఫ్టీ కోసం రీసెర్చ్ అండ్ ఇన్సైట్స్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఆమె గతంలో ఫేస్బుక్లో పాలసీ అనాలసిస్ గ్లోబల్ హెడ్‌గా వ్యవహరించారు. అధిక ప్రమాదం, అధిక హాని భద్రత, క్లిష్టమైన అంతర్జాతీయ భద్రతా సమస్యలపై దృష్టిసారించేవారు. రాధా గతంలో రాండ్ కార్పొరేషన్లో సీనియర్ ఎకనామిస్ట్‌గా వ్యవహరించారు. డిఫెన్స్ విభాగం, ఎనర్జీ విభాగం, వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో జాతీయ భద్రతా సమస్యలపై అనేక పదవులను అధిరోహించారు.