Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : మహమ్మద్ ప్రవక్తపై భారత అధికార పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను అమెరికా ఖండించింది. ''ఇద్దరు బీజేపీ నేతలు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను మేం ఖండిస్తున్నాం. ఆ వ్యాఖ్యలను పార్టీ బహిరంగంగా ఖండిస్తున్నందుకు మేం సంతోషిస్తున్నాం'' అని అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్ మీడియాకు చెప్పారు. మత స్వేచ్ఛ లేదా విశ్వాసాలకు సంబంధించిన మానవ హక్కుల ఆందోళనలపై ఎప్పటికప్పుడు భారత్తో సీనియర్ అధికారుల స్థాయి సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. మానవ హక్కుల పట్ల గౌరవాన్ని పెంపొందించే విధంగా తాము భారత్కు ప్రోత్సాహాన్నిస్తున్నామని అన్నారు. గత నెల 26న మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ, నవీన్ జిందాల్లు చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ముస్లిం దేశాలు భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేశాయి.