Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 ఏండ్లలో అతిపెద్ద సమ్మె ఇదే!
లండన్ : బ్రిటన్లో రైల్వే కార్మికుల చారిత్రాత్మక సమ్మె గురువారం మొదలైంది. ఇంత పెద్దయెత్తున రైల్వేకార్మికులు దేశ వ్యాపితంగా ఉద్యమిం చడం గత 30 ఏండ్లలో ఇదే మొదటిసారి.ఈ సమ్మెలో వేలాది మంది కార్మికులు పాల్గొంటున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి తగినట్లుగా వేతనాలు పెంచాలని, . పని పరిస్థితులను మెరుగుపరచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెన్షన్లను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. 40ఏండ్లలో ఎన్నడూ లేనంత అధికంగా బ్రిటన్లో ధరలు పెరిగిపోయాయి. ఆహారం, ఇంధన ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతూనే వున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం 10శాతానికి చేరువవుతోంది. రైల్వే పెన్షన్ పథకంపై రైల్వే కంపెనీలు దాడి చేస్తున్నాయని, కార్మికుల ప్రయోజనాలను నీరు గారుస్తున్నాయని రైల్, మారిటైమ్, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ (ఆర్ఎంటి) రైల్ యూనియన్ విమర్శిస్తోంది.