Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వృద్థి రేటు అంచనాలకు ఐఎంఎఫ్ కోత
- ద్రవ్యోల్బణ కట్టడే కీలకం
వాషింగ్టన్ : అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రతికూలతలో ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ఆందో ళన వ్యక్తం చేసింది. ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటు ందని సంకేతాలు ఇచ్చింది. 2022, 2023లోనూ అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగించనుందని విశ్లేషించింది. అధిక ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయమే ఆర్థిక వ్యవస్థలో బలహీనతలకు నిదర్శనమని పేర్కొంది. 2022లో అమెరికా వృద్థి రేటు 2.9 శాతానికి పడిపోనుందని తెలిపింది. ఇంతక్రితం ఏప్రిల్‌లో ఈ అంచనా ఏకంగా 3.7 శాతం పెరుగొచ్చని విశ్లేషించింది. 2023లో ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించి జిడిపి 1.7 శాతానికే పరిమితం కావొచ్చ ని అంచనా వేసింది. ఇంతక్రితం ఈ అంచనా 2.3 శాతం వృద్థిగా ఉంది. 2024లో వృద్థి ఏకంగా 0.8 శాతానికి క్షీణించొచ్చని పేర్కొంది. 2022లో అమెరికా ఏకంగా 5.2 శాతం వృద్థిని సాధించనుందని గతేడాది అక్టోబర్‌లో ఐఎంఎఫ్ అంచనా వేసింది. తాజా అంచనాలు ఆ ఆదేశ ఆర్థిక వ్యవస్థ పతనాన్ని స్పష్టం చేస్తున్నాయి.
అమెరికాలో కరోనా వేరియంట్లు పెరగడం, సప్లయి చెయిన్‌లో అంతరాలు రికవరీని మందగించేలా చేశాయి. మరోవైపు రష్యా- ఉక్రెయిన్ పరిణామాలకు తోడు అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ట స్థాయికి ఎగిసింది. ''అమెరికాలో ఆర్థిక సంక్షోభం క్రమంగా పెరుగుతోంది. భవిష్యత్తు వృద్థి తీవ్ర అనిశ్చిత్తిలో ఉంది'' అని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిష్టాలిన జార్జియా పేర్కొన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ''రష్యా, ఉక్రెయిన్ అంశాలు, చైనాలో లాక్డౌన్ నిబంధనలు ఆర్థిక పరిస్థితుల్లో మరింత క్లిష్టతను పెంచనున ా్నయి'' అని తెలిపారు. '' దేశం ఆర్థిక సంక్షోభంలోకి జారుకోవడంతో నిరుద్యోగం మరింత పెరగనుంది. 2001 నాటి అమెరికా ఆర్థిక సంక్షోభం గుర్తుకు వస్తుంది.'' అని ఐఎంఎఫ్ డిప్యూటీ వెస్టర్న్ హెమిస్పెర్ డైరెక్టర్ నిగెల్ చాక్ పేర్కొన్నారు.
ధరల స్థీరీకరణ చాలా ముఖ్యమైందని.. దీంతో అమెరికా ఆదా యాలు, సమగ్ర వృద్థికి దోహదం చేయనుందని జార్జివా పేర్కొన్నారు. కానీ దీన్ని చేరడం కొంత కష్టమేనని పేర్కొన్నారు. అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్, ఫెడ్ ఛైర్మన్ జెరెమ్ పావెల్‌లు అంకిత భావంతో ద్రవ్యోల్బణాన్ని తిరిగి కట్టడి చేయగలరని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి కట్టడి చేయాలనే అమెరికా సెంట్రల్ బ్యాంక్ లక్ష్యానికంటే.. ప్రస్తుతం మూడు రెట్లు ఎక్కువగా ఉంది. అధిక ధరల కట్టడికి అమెరికా ఫెడ్ తీసుకున్న వడ్డీ రేట్ల పెంపు విధాన నిర్ణయం సరైందని జార్జివా తెలిపారు. వడ్డీ రేట్ల పెంపుతో ఆర్థిక పరిస్థితులను కఠినతరం చేయడానికి వీలుందన్నారు. దీంతో ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడానికి అవకాశం ఉందన్నారు.