Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మ్యూనిచ్‌లో వేలాది మందితో ప్రదర్శన
మ్యూనిచ్ : జీ 7 దేశాల శిఖరాగ్ర సదస్సుకు ఆతిధ్యమిస్తున్న జర్మనీలోని మ్యూనిచ్‌లో ఒక రోజు ముందే నిరసనలు హౌరెత్తాయి. జీ-7 దేశాల విధానాలకు వ్యతిరేకంగాను, సామ్రాజ్యవాద యుద్ధాలకు వ్యతిరేకంగా వివిధ దేశాలకు చెందిన వేలాది మంది హక్కుల కార్యకర్తలు ఇక్కడ చేరి నిరసన తెలిపారు. శిలాజ ఇంధనాలకు స్వస్తి పలకాలని, జీవవైవిధ్యాన్ని కాపాడాలని, సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించాలని, ఆకలి, పేదరికంపై పోరాడాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ అంశాలపై ప్రపంచ నాయకులు దృష్టి పెట్టాలని వారు కోరారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్), ఫ్రైడేెస్ ఫర్ ఫ్యూచర్ వంటి సంస్థలు ఈ నిరసనల్లో భాగస్వాములయ్యాయి. జీ7 దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, ఇంగ్లండ్, అమెరికా నాయకులతో పాటు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు చార్లెస్ మిచెల్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షులు ఉర్సులా వాన్‌డెర్ లెయన్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
ఉక్రెయిన్ సంక్షోభంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందుతున్న దేశాలతో భాగస్వామ్యం, విదేశీ- భద్రతా విధానం, స్థిరత్వం, ఆహార భద్రత, బహుపాక్షికత, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి ఆంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమమావేశంలో వివిధ సెషన్లలో పాల్గొనేందుకు భారత్, అర్జెంటీనా, ఇండోనేషియా, సెనెగల్, దక్షిణాఫ్రికా ప్రతినిధులను జీ-7 కూటమి ఆహ్వానించింది.