Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకే ట్రక్కులో 46మంది మృతి
టెక్సాస్ : అమెరికాలో వలసలు విషాదాంతాలుగా మారుతున్నాయి. తాజాగా టెక్సాస్లోని శాన్ ఆంటోనియోలో ఒక కంటైనర్ ట్రాలీలో ప్రయాణిస్తున్న 46 మంది మృతి చెందారు. ఈ ఘటన వెలుగు చూసిన ప్రదేశం అక్రమ వలసల మార్గమైన అమెరికా-మెక్సికో సరిహద్దులకు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్రమ వలసల మార్గమైన అమెరికా-మెక్సికో సరిహద్దులకు 250 కిలోమీటర్ల దూరంలో శాన్ ఆంటోనియో సమీపంలోని ఒక భవనం వద్ద ఓ డ్రైవర్ ట్రక్కును వదిలేసి వెళ్లిపోయాడు. సాయంత్రం 6 గంటల సమయంలో అక్కడ పనిచేసే ఓ కార్మికుడికి ట్రక్కు నుంచి ఆర్తనాదాలు వినిపించాయి. దీంతో అక్కడికి వెళ్లి చూడగా, కంటైనర్ తలుపు పాక్షికంగా తెరిచిఉండటాన్ని కార్మికుడు గమనించాడు. ట్రక్కులో చాలామంది అచేతనంగా పడిపోయి కనిపించారు. ప్రాణాలతో ఉన్న వారి శరీర ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. ఆ ట్రక్కులోని రెఫ్రిజిరేటర్లలో నీరు లేదు, ఎయిర్ కండీషన్ పని చేయడంలేదు. కార్మికుడి సమాచారంతో ఎమర్జెన్సీ రెస్పాన్స్ బందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రాణాలతో ఉన్న వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో 46 మంది మృతి చెందగా, మరో 16 మంది ఆస్పత్రిపాలయ్యారు.