Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీస్తా సెతల్వాద్, జుబైర్ అరెస్టులు 'షాక్'కు గురి చేశాయి: 'నోబెల్' గ్రహీత మరియా రెస్సా
హోనోలులు: సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్, జర్నలిస్టు మహమ్మద్ జుబైర్ అరెస్టుపై అంతర్జాతీయ సమాజం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నది. వీరి అరెస్టులు తనను షాక్‌కు ఉరి చేశాయని నోబెల్ బహుమతి గ్రహీత, ఫిలిప్పిన్స్ జర్నలిస్టు మరియా రెస్సా అన్నారు. హవాయిలోని ఒక కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన ఆమె ఒక వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పై విధంగా స్పందించారు. ఆ ఇద్దరూ (తీస్తా సెతల్వాద్, జుబైర్) ప్రస్తుతం జైలులో ఉన్నారన్న ప్రశ్నకు సమాధానంగా ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలూ చేశారు. ''భారత జర్నలిస్టులందరూ దీని గురించి మాట్లాడాలి. అందరూ కలిసి దీనిని ఎదురిం చాలి. ప్రతి ఒక్కరూ దీని గురించి రాయాలి. నేను నాకు ఎదురైన అనుభవం నుంచి చెప్తాను. నేను అరెస్టు అయినప్పుడు జర్నలిస్టులు.. ప్రజలు పోరాడలేదు. కారణం.. స్వార్థ ప్రయోజనం. కానీ ప్రతిఒక్కరూ ఎలా ఏకమవుతారు? మీరు (జర్నలిస్టులు) ప్రతి ఒక్కరితో మాట్లాడా లి. ఇందులోకి ప్రజలను తీసుకురావాలి. ఈ విషయంలో సామాజిక కార్యకర్తలు గొప్పవారు'' అని ఆమె అన్నారు. తీస్తా సెతల్వాద్‌ను గుజరాత్ తీవ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్న విషయం విదిత మే. 2002 గుజరాత్ నరమేధం కేసులో ఆ రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి క్లీన్ చీట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖ లైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. ఆ తర్వాతి రోజే తీస్తా సెతల్వా ద్ అరెస్టు జరగటం గమనార్హం. ఒక వర్గం మనోభావాలు దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్టులున్నాయంటూ ఢిల్లీ పోలీసులు ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థా పకుడు జుబైర్‌ను సోమవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరి అరెస్టులపై భారత్‌లోని రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలతో పాటు అంతర్జాతీయ సమాజమూ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశాయి.