Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనీలా : ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. దేశ అత్యున్నత పదవిలో కొడుకును కూర్చోబెట్టడానికి దశాబ్దాల తరబడి తండ్రి చేసిన ప్రయత్నాలు దీంతో పూర్తయ్యాయి. ఫెర్డినాండ్ మార్కోస్ సీనియర్ పాలనను మానవ హక్కుల దుర్వినియోగం, అవినీతితో నిండిన చీకటి అధ్యాయంగా రాజకీయ విమర్శకులు పేర్కొంటారు. ప్రమాణ స్వీకారం అనంతరం అటువంటి తన తండ్రి పాలనను ప్రశంసిస్తూ జూనియర్ మాట్లాడారు. గత నెల్లో జరిగిన ఎన్నికల్లో మార్కోస్ జూనియర్ (64) ఘన విజయం సాధించారు. వందలాదిమంది స్థానిక, విదేశీ ప్రతినిధుల సమక్షంలో మనీలాలో నేషనల్ మ్యూజియం వద్ద జరిగిన బహిరంగ కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మార్కోస్ను అనర్హుడిగా చేయడానికి, అధికార పగ్గాలు చేపట్టకుండా నివారించడానికి జరిగిన పలు ప్రయత్నాలను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన తర్వాత ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. కోవిడ్ నేపథ్యంలో పెరుగుతున్న ధరలతో ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ.. ఆహార ఉత్పత్తిని పెంచడం, అభివృద్ధిని వేగిరపరచడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని మాక్రోస్ జూనియర్ చెప్పారు.