Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యా రక్షణ మంత్రి ప్రకటన
మాస్కో: ఉక్రెయిన్ దళాల కబంధ హస్తాల్లో నుంచి డాన్బాస్ రిపబ్లిక్‌ను పూర్తిగా విముక్తం గావించినట్లు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగు ఆదివారం ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా దీనిని ధ్రువీకరించారు. 2014 నుంచి ఉక్రెయిన్ అదుపులో ఉన్న అతి పెద్ద పట్టణం లిషించాన్స్క్ను రష్యన్ దళాలు వశపరచుకోవడంతో డాన్ బాస్ రిపబ్లిక్ ఉక్రెయిన్ నుంచి పూర్తిగా విముక్తి పొందినట్లైందని ఆయన అన్నారు. ఈ ప్రాంతంపై పట్టు కోసం రష్యా, ఉక్రెయిన్ దళాల మధ్య వారం రోజులుగా సాగుతున్న భీకర పోరు దీంతో ముగిసింది. డాన్‌బాస్‌ను స్వతంత్ర రిపబ్లిక్‌గా గుర్తిస్తున్నట్లు గత ఫిబ్రవరిలో రష్యా ఒక ప్రకటన చేసింది. డాన్ బాస్‌ను విముక్తి చేసిన తరువాత రష్యన్ దళాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై గురిపెట్టాయి.