Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎంఎఫ్ చీఫ్
న్యూయార్క్: అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యాన్ని ఎదు ర్కొనే అవకాశాలను కొట్టిపారేయ లేమని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా వ్యాఖ్యానించా రు. ఏప్రిల్ నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా ఇబ్బందుల ను ఎదుర్కొంటోందని, ఈ ముప్పు లన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే వచ్చే ఏడాది మాంద్యం నెలకొనే ముప్పును తోసిపుచ్చలేమన్నారు. ఈ ఏడాదిలోనే మూడుసార్లు ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటును సవ రించారు. రాబోయే వారాల్లో ఈ రేటు మరింత తగ్గుతుందని, ఆర్థిక వేత్తలు దీనిపై కసరత్తు చేస్తున్నా రని అన్నారు. జులై చివరిలో 2022, 2023 సంవత్సరాలకు ఆధునీకరించిన అంచనాలను ఐఎంఎఫ్ విడుదల చేస్తుందని భావిస్తున్నారు. ఏప్రిల్లో దాదాపు ఒక శాతం పాయింట్లను కుదిం చింది. అప్పటి నుండి పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని క్రిస్టిలినా మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు.