Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్తులు స్వాధీనం
కీవ్ : కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఉక్రెయిన్(కేపీయూ)ను శాశ్వతంగా నిషేధించారు. పార్టీకి చెందిన భవనాలు, నిధులతో సహా మొత్తం ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఉక్రెయిన్ న్యాయ మంత్రిత్వ శాఖ వాదనలతో ఏకీభవించిన తరువాత ఎనిమిదవ అడ్మినిస్ట్రేటివ్ అప్పీ ల్ కోర్టు ఈ మేరకు తీర్పు వెల్లడించింది. 'కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఉక్రె యిన్ కార్యాకలాపాలు నిషేధించాం. పార్టీ యొక్క ప్రాంతీయ, జిల్లా కేంద్రాలతో పాటు ఇతర నిర్మాణాత్మక ఆస్తులు, నిధులు ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి' అని కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఉక్రెయిన్ ప్రభు త్వం తాజాగా మరొక ప్రతిపక్షం (కేపీయూ)న్ని నిషేధించినట్లయింది. ఇప్పటికే ఫర్ లెఫ్ పార్టీ, లెఫ్ట్ అపోజిషన్, యునియన్ ఆఫ్ లెఫ్ట్ ఫోర్సెస్, సోషలిస్టు పార్టీ ఆఫ్ ఉక్రెయిన్ వంటి ప్రతిపక్ష పార్టీలను ఉక్రెయిన్ ప్రభుత్వం నిషేధించింది. రష్యాకు అనుకూలంగా ఉన్న రాజ కీయపార్టీలంటీన్ని చట్టవిరుద్ధం చేస్తూ మే 14న ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీ సంతం చేసిన ఉత్తర్వులను అనుసరిస్తూ ఈ నిషేధాలు అమలువుతున్నాయి. కేపీయూ చివరిసారిగా 2012 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసింది. 13 శాతం ఓట్లను సొంతం చేసుకుంది.