Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచవ్యాప్తంగా రహస్యంగా 23 యుద్ధాలు
- ది ఇంటర్స్పెట్ నివేదిక
న్యూయార్క్ : అమెరికా యుద్ధ దాహం గురించి తాజాగా ఒక నివేదిక వెల్లడించిన నిజాలు నివ్వెరపరుస్తున్నాయి. అమెరికాకు చెందిన స్పెషల్ ఆపరేషనల్ ఫోర్సెస్ ప్రపంచవ్యాప్తంగా కనీసం 23 రహాస్య యుద్దాల్లో పాల్గొనట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. ఇది గతంలో అంచనా వేసిన దానికంటే చాలా అధికం. ది ఇంటర్స్పెట్ నివేదిక ప్రకారం 2017 నుంచి 2002 వరకూ ప్రపంచవ్యాప్తంగా 23 యుద్ధా లను అమెరికా కమాండర్లు నిర్వహించారు. 310 మిలియన్ డాలర్ల వ్యయంతో వీటిని చేపట్టారు. ఇందులో 14 యుద్ధాలను మధ్య ఆసి యా, ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలో జరిపారు. ఫ్రీడం ఆఫ్ ఇన్ఫర్మ మేషన్ యాక్ట్ ద్వారా ఈ వివరాలను సంపాదించారు. స్పెషల్ ఆపరేష న్స్ కమాండ్ (ఎస్ఓసీఓఎం), సెంట్రల్ కమాండ్.. ఈ రెండింటికీ గతంలో హెడ్‌గా ఉన్న అమెరికా మాజీ ఆర్మీ జనరల్ జోసెఫ్ వోటెల్ ఈ వివరాలను ధృవీకరించారు. 127ఇ (తీవ్రవాదనిరోధకం) పేరుతో ఈజిప్టు, లెబనాన్, సిరియా, యెమెన్ దేశాల్లో వీటిని చేపట్టారు.